logo

అడిగింది కొండంత... ఇచ్చింది గోరంత

కన్నడనాడుకు రూ.18 వేల కోట్ల కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కోరితే కేంద్రం రూ.3,454 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published : 29 Apr 2024 01:14 IST

మహాత్ముని విగ్రహం వద్ద నినాదాలు రాసిన అట్టముక్కలతో ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ కీలక నేతలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కన్నడనాడుకు రూ.18 వేల కోట్ల కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కోరితే కేంద్రం రూ.3,454 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడిగులు ఏటా రూ.4 లక్షల కోట్ల పన్నులు కడుతున్నా, కేంద్రం దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కలిసి విధానసౌధ ఆవరణలోని మహాత్ముని ప్రతిమ వద్ద ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. ఖాళీ చెంబులు, నినాదాలు రాసిన అట్టముక్కలను ప్రదర్శించారు. రాష్ట్రంలో 223 తాలూకాల్లో కరవు తాండవమాడుతుంటే కేంద్రం విడుదల చేసిన పరిహారం దేనికీ సరిపోదని సిద్ధరామయ్య వాపోయారు. తాము గ్యారంటీ పథకాలకు డబ్బు అడిగితే భాజపా నాయకులు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖాళీ చెంబు ఇచ్చిన పార్టీ, చెంబేశ్వర మోదీ, గో బ్యాక్‌ మోదీ.. అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. కన్నడిగులను అవమానించవద్దంటూ నినాదాలు రాసిన అట్టముక్కలతో మహాత్ముని ప్రతిమ నుంచి దేవరాజ అరసు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి, ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని