logo

ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు

ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు

Published : 25 Apr 2024 02:41 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన నామపత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌కు అందించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, మదన్‌లాల్‌, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు తరపున రెండు సెట్ల నామినేషన్లను లకావత్‌ సైదులు, బచ్చలికూర నాగరాజు, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర సింగ్‌, అనూష, రాకేశ్‌, మలీదు వెంకటేశ్వర్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోట్ల నాగేశ్వరరావు 3 సెట్ల నామినేషన్లు ఆర్వోకు అందించారు. కాంగ్రెస్‌ పార్టీ పేరుతోనే కొత్తగూడేనికి చెందిన నాగా సీతారాములు తరపున తేజ ప్రకాష్‌ ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు వారి ప్రతిపాదకులతో కలసి నామపత్రాలు దాఖలు చేశారు. భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నాలుగో సెట్‌ నామపత్రం వేశారు.

  • కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ముగ్గురు అభ్యర్థుల నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. రామసహాయం రఘురామరెడ్డి పేరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మంగళవారం నామినేషన్‌ వేశారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి మొత్తం నలుగురు నామపత్రాలు దాఖలు చేసినట్టయింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని