logo

21 మంది ధరావతు కోల్పోయారు..!

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు.

Published : 28 Apr 2024 01:23 IST

మధిర, న్యూస్‌టుడే: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు. మొత్తం ఖమ్మం లోక్‌సభకు 23మంది పోటీ చేయగా కేవలం ఇద్దరు మాత్రమే తమ ధరావతు కాపాడుకున్నారు. 11,39,848 ఓట్లు పోలయ్యాయి. తెరాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 (49.78 శాతం) ఓట్లతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరికి 3,99,397 ఓట్లు (35.04 శాతం), సీపీఎం అభ్యర్థి బోడా వెంకట్‌కు 57,102 ఓట్లు (5.01 శాతం), భాజపా అభ్యర్థి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు (1.8 శాతం), జనసేన అభ్యర్థి నార్ల సత్యనారాయణకు 19,315 ఓట్లు (1.69 శాతం) లభించాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 15,832 ఓట్లు (1.39శాతం) వచ్చాయి. మిగతా స్వతంత్ర అభ్యర్థులకు నామమాత్రంగా ఓట్లు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు