logo

కొవిడ్‌ బాధిత గర్భిణికి..108లో సుఖ ప్రసవం

కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ భయంతో వణుకుతున్న తరుణంలో కొవిడ్‌ బారిన పడి పురిటినొప్పులతో అలమటిస్తున్న నిండు గర్భిణికి 108 వాహన సిబ్బంది సుఖ ప్రసవం చేసి ధైర్యసాహసాలు చాటుకున్నారు. వివరాల్లోకెళితే...కైకలూరుకు

Published : 23 Jan 2022 03:11 IST

శిశువుతో ఈఎంటీ రజని

కైకలూరు, న్యూస్‌టుడే: కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ భయంతో వణుకుతున్న తరుణంలో కొవిడ్‌ బారిన పడి పురిటినొప్పులతో అలమటిస్తున్న నిండు గర్భిణికి 108 వాహన సిబ్బంది సుఖ ప్రసవం చేసి ధైర్యసాహసాలు చాటుకున్నారు. వివరాల్లోకెళితే...కైకలూరుకు చెందిన మహిళ (24) ప్రసవం కోసం స్థానిక సామాజిక ఆరోగ్యకేంద్రానికి వచ్చారు. ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. గర్భిణి, కడుపులో బిడ్డ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఇక్కడ వైద్యులు మచిలీపట్నం తరలించాలని సూచించారు. 108 వాహనంలో వెళుతుండగా మార్గంమధ్యలో పురిటినొప్పులు అధికమవడంతో ఈఎంటీ రజనీకుమారి పీపీఈ కిట్‌ ధరించి గర్భిణికి ప్రసవం చేశారు. బాలింత, ఆమె జన్మనిచ్చిన ఆడబిడ్డను వాహన చోదకుడు బోయిన వాకలరావు సహకారంతో క్షేమంగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా చూశారు. గర్భిణికి సుఖ ప్రసవం చేసిన సిబ్బందిని 108 వాహనాల జిల్లా అధికారి సురేష్‌కుమార్‌, డివిజనల్‌ అధికారి ప్రశాంత్‌, సహచర సిబ్బంది అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని