జీవో 1.. బ్రిటిషు పాలనను తలదన్నేలా ఉంది
రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన.. బ్రిటిషు పాలనను తలదన్నేలా ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన.. బ్రిటిషు పాలనను తలదన్నేలా ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన గురువారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతుల విషయంలో డీజీపీ వింత పోకడలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో పోలీసు శాఖ అనవసరమైన షరతులు పెడుతోందని.. ఇది పోలీసు వ్యవస్థకే సిగ్గు చేటన్నారు. దండి యాత్రకు కూడా ఆనాటి బ్రిటిషు పాలకులు ఇన్ని ఆంక్షలు పెట్టలేదని చెప్పారు. మీ పాలనలో డొల్లతనాన్ని, మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. ఇప్పటికే అవినీతిలో నంబరు 1గా నిలిచిన మీరు.. ఒకటో నంబరు జీవో తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు రోడ్‌షోలకు హాజరవుతున్న జనాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని.. చంద్రబాబును నిలువరించేందుకు.. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 తీసుకొచ్చారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన జీవో అని తెలిపారు. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లోకేశ్ పాదయాత్రకు పోలీసు శాఖ పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని హితవు పలికారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!
-
World News
TikTok- China: కంపెనీల నుంచి విదేశాల డేటా అడగదట..!
-
General News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
India News
Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలం..!’