logo

పిడుగుపాటుకు మూడు ఎద్దులు మృతి

మండలంలోని లింగాలపల్లి కనుగొట్ల గ్రామాలలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడటంతో మూడు ఎద్దులు మృతి చెందాయి.

Published : 20 Apr 2024 15:52 IST

వెల్దుర్తి: మండలంలోని లింగాలపల్లి కనుగొట్ల గ్రామాలలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడటంతో మూడు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన భాష అనే రైతుకు చెందిన రెండు ఎద్దులను ఇంటి సమీపంలో చెట్టుకు కట్టివేయడంతో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కలుగొట్ల గ్రామంలో సైతం ఒక ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. సంఘటన స్థలాన్ని వీఆర్వో ఎల్లకృష్ణ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని