logo

సాయన్నా ఈ నరకయాతనకు కారకులెవరో...

ఆదోని పట్టణంలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా సోమవారం ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పట్టణ దారులను విస్తరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది నెరవేరక ఇరుకు దారులే మిగిలాయి.

Published : 23 Apr 2024 03:15 IST

దోని పట్టణంలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా సోమవారం ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పట్టణ దారులను విస్తరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది నెరవేరక ఇరుకు దారులే మిగిలాయి. నామినేషన్‌ కార్యక్రమాన్ని బలప్రదర్శన వేదికగా మార్చుకోవాలని భావించి, మూడు రోజులుగా జనసమీకరణ చేస్తూ వచ్చారు. ఇందుకు వార్డులు, గ్రామాల వారీగా భోజనం ప్యాకెట్లు అందజేశారు. దీంతో జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. రెండు మూడు గంటల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన జనం నరకయాతన అనుభవించారు. మండే ఎండలు, ఇరుకుదారులు.. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. యంత్రాంగం ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు.

న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని