logo

ggg: వైకాపా నాయకులకు నిరసన సెగ

 పత్తికొండ పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైకాపా నాయకులకు ముస్లిం మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 

Published : 28 Apr 2024 19:18 IST

పత్తికొండ రూరల్‌: పత్తికొండ పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైకాపా నాయకులకు ముస్లిం మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పట్టణంలోని చెరువు కట్ట సమీపంలోని ముస్లిం కాలనీలో గత కొన్నేళ్లుగా సీసీ రహదారులు లేక డ్రైనేజీ కాలువలు పొంగి మురుగునీరు రోడ్లపైకి వచ్చి చేరుతుందని పలుమార్లు అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లిన గత ఐదేళ్లుగా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మా కాలనీలో రోడ్డు వేసే వరకు ఓటు వేసేది లేదని వారు తేల్చి చెప్పారు. దీంతో అసహనానికి గురైన వైకాపా నాయకులు నాగరత్నమ్మ సోమశేఖర్ శ్రీరంగడు తదితరులు ఓటు అడిగేందుకు వచ్చినప్పుడే రోడ్డు గుర్తొస్తుందా ఓటుకు రోడ్డుకు ఏం సంబంధం అని మహిళలను ఎదురు ప్రశ్నించారు. అయినా వారు వెనక్కి తగ్గక ఓటు వేసేది లేదు అని తేల్చి చెప్పడంతో వైకాపా నాయకులు అక్కడ నుంచి వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని