logo

3 ఎమ్మెల్యేలు.. 6కి.మీ..18ఏళ్లు

ఈ అంకెలు ఏంటీ అనుకుంటున్నారా..? సి.బెళగల్‌ మండలం కొండాపురం- ఇనగండ్ల మధ్య 6 కి.మీ. మట్టి రోడ్డును బీటీగా మారుస్తామని గత 18 ఏళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.

Published : 02 May 2024 03:25 IST

ఈ అంకెలు ఏంటీ అనుకుంటున్నారా..? సి.బెళగల్‌ మండలం కొండాపురం- ఇనగండ్ల మధ్య 6 కి.మీ. మట్టి రోడ్డును బీటీగా మారుస్తామని గత 18 ఏళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఒక్కరూ తట్టెడు తారు పోయలేదు. బీటీ రహదారిగా మార్చి గుండ్రేవుల దారికి అనుసంధానిస్తామని ఎమ్మెల్యే మురళీకృష్ణ (2006-2011), మణిగాంధీ(2014-19), డా.సుధాకర్‌ (2019-24)లు హామీ ఇచ్చారు. ఒక్కరి హామీ నెరవేరలేదు. మండల కేంద్రానికి దగ్గరి దారి కావడంతో కొండాపురం, పల్దొడ్డి, ముడుమాల గ్రామాల మధ్య నిత్యం 500 వాహనాలు, 1,200 మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో మట్టి దారి అధ్వానంగా మారుతుండటంతో 15 కి.మీ. దూరం పోలకల్లు మీదుగా మండల కేంద్రానికి వెళ్తారు.

న్యూస్‌టుడే, సి.బెళగల్‌ గ్రామీణం, సి.బెళగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని