logo

స్వచ్ఛందంగా తెదేపాలోకి చేరికలు: బీసీ

ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు.

Published : 03 May 2024 03:46 IST

బనగానపల్లి, న్యూస్‌టుడే: ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. వారికి బీసీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బనగానపల్లి మండలం జంబులదిన్నెకు చెందిన 10 కుటుంబాలు, చెరువుపల్లెకు చెందిన 10 కుటుంబాలు, బీరవోలుకు చెందిన 45 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. వారికి బీసీ ఇందిరమ్మ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించే బాధ్యత తీసుకోవాలని వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని