logo

అమ్మాయిలదే పైచేయి

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.  రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు.  వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్‌ సాధించింది.

Published : 25 Apr 2024 07:48 IST

న్య్రూస్‌టుడే, నారాయణపేట పట్టణం, న్యూటౌన్‌: ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.  రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు.  వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్‌ సాధించింది.

జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 3,781 మంది పరీక్షలకు హాజరుకాగా 1,675 మంది(44.3శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 1,635 మందికి 482 మంది పాస్‌కాగా 29.48 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,146 మందికి 1,193 మంది పాస్‌కాగా 55.59 శాతం ఉత్తీర్ణత సాధించారు. ః  ఇంటర్‌ రెండో సంవత్సరంలో 3,386 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు 1,822 మంది(58శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 1,435 మందికి 573 మంది పాస్‌కాగా 39.93 శాతం నమోదైంది. బాలికలు 1,951 మందికి 1,249 మంది విద్యార్థులు పాస్‌కాగా 64.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలోను అమ్మాలదే హవాగా నిలిచింది. ః ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సంలో 243 మంది పరీక్షలకు హాజరుకాగా 93 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 202 మంది పరీక్షలకు హాజరుకాగా 103 మంది పాసయ్యారు.

 వృత్తి విద్యలో రాష్ట్రంలో ప్రథమం

 ఇంటర్మీడియట్ సాధారణ పలితాల్లో దిగువ నుంచి రెండో స్థానంలో ఉన్న పేట జిల్లా వృత్తివిద్య పలితాల్లో మాత్రం రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరానికి 577 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 72.96 శాతంతో 421 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 184 మంది హాజరైతే 48.37తో 89 మంది పాసయ్యారు. బాలికలు 393 మంది పరీక్షలు రాయగా 84.48 శాతంతో 332 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 542 మంది విద్యార్థులు హాజరైతే 80.44 శాతంతో 436 మంది పాసయ్యారు. ఇందులో 168 మంది బాలురకు 97 మంది, 374 మంది బాలికలకు 339 మంది విజయం సాధించారు. దామరగిద్ద, ఉట్కూరు మండలాల్లోని కేజీబీవీల్లోని వృత్తి విద్యా కోర్సులు పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ పాసయ్యారు. ఈ విజయంపై జీసీడీవో పద్మనళిని సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని