logo

రాఖీ కట్టాం.. బతికి రా అన్నా.. కంటతడి పెట్టించే ఘటన

అనారోగ్యంతో ఉన్న అన్న కోలుకొని ఆరోగ్యవంతుడిగా తిరగాలని రాఖీ కడదామని వద్దామనుకుంటున్న చెల్లెళ్లకు పిడుగులాంటి కబురు అందింది.

Updated : 01 Sep 2023 07:17 IST

రాఖీ కడుతూ రోదిస్తున్న చెల్లెలు అంబిక

నర్సాపూర్‌ రూరల్‌, న్యూస్‌టుడే: అనారోగ్యంతో ఉన్న అన్న కోలుకొని ఆరోగ్యవంతుడిగా తిరగాలని రాఖీ కడదామని వద్దామనుకుంటున్న చెల్లెళ్లకు పిడుగులాంటి కబురు అందింది. గుండెలనిండా విషాదంతో సోదరుడి ఇంటికి వచ్చిన చెల్లెళ్లు మృతదేహానికే రాఖీలు కట్టి అన్నా.. బతికి రా అన్నా.. అని విలపించడం గ్రామస్థులను కలిచివేసింది. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్‌ మండలం ఆవంచ గ్రామానికి చెందిన కొండి జగన్‌(45)కు నరసమ్మ, అంబిక అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

పెళ్లిళ్లు కావడంతో ఒకరు మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో మరొకరు అదే గ్రామంలో కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. గత కొంత కాలంగా జగన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో వైద్యం చేయించి ఇటీవల ఇంటికి తీసుకొచ్చారు. రక్షాబంధన్‌ సందర్భంగా గురువారం సాయంత్రం చెల్లెళ్లు ఇద్దరూ సోదరుడికి రాఖీ కట్టేందుకు వద్దామనుకుంటున్న సమయంలో దుర్వార్త అందింది. దుఃఖాన్ని దిగమింగుకొని అన్న వద్దకు వచ్చిన ఇద్దరూ మృతదేహానికే రాఖీలు కట్టి రోదించడం గ్రామస్థుల కంటనీరు పెట్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని