logo

Karimnagar: పోలీస్‌ ఉద్యోగం వద్దన్నందుకు వివాహిత ఆత్మహత్య

ఉద్యోగం చేయాలని లక్ష్యం పెట్టుకుంది.. అందుకు అనుగుణంగా రాత్రింబవళ్లు శ్రమించి అనుకున్నది సాధించింది..

Updated : 17 Sep 2023 10:52 IST

 పెళ్లయిన నాలుగు నెలలకే ఘటన
అత్తింటి వేధింపులే కారణమంటూ ఆరోపణ

కల్యాణి

నంగునూరు, న్యూస్‌టుడే: ఉద్యోగం చేయాలని లక్ష్యం పెట్టుకుంది.. అందుకు అనుగుణంగా రాత్రింబవళ్లు శ్రమించి అనుకున్నది సాధించింది.. అయితే పోలీసు ఉద్యోగం వద్దంటూ అత్తింటి వేధింపులు అధికమవడంతో మనస్తాపానికి గురైన వివాహిత పెళ్లయిన నాలుగు నెలలకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నంగునూరు మండలం గట్లమల్యాలలో శుక్రవారం రాత్రి జరిగింది. గ్రామస్థులు, రాజగోపాలపేట ఠాణా ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కారు హరీశ్‌తో కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గం వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్త రాజయ్య కుమార్తె కల్యాణికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఎంబీఏ చదివిన ఆమె పోలీసు ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షించింది. ఇటీవల ఫలితాలు రావడంతో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి అర్హత సాధించింది. పోలీస్‌ ఉద్యోగం వద్దంటూ సూటిపోటి మాటలతో భర్త హరీశ్‌, అత్త రమణ, మరిది శ్రీహరి మానసికంగా వేధించారు. కలత చెందిన కల్యాణి శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని