logo

ఈసారి అవకాశం ఇవ్వండి

భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, భాజపా అభ్యర్థి బండి సంజయ్‌లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్‌ లోక్‌సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్‌రావు కోరారు.

Published : 23 Apr 2024 01:44 IST

నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ నేత రాజేందర్‌రావు

ర్యాలీలో అభివాదం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కాంగ్రెస్‌ నేత వెలిచాల రాజేందర్‌రావు

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, భాజపా అభ్యర్థి బండి సంజయ్‌లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్‌ లోక్‌సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్‌రావు కోరారు. సోమవారం సర్కస్‌గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. నామపత్రాలు దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ప్రజలతో సంబంధాలు ఉన్నాయని, తన తండ్రి వి.జగపతిరావు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇక్కడి ప్రజలకు సేవలు అందించడమే కాకుండా అభివృద్ద్ధి చేశారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నాయకత్వంలో తాను ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట, జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని..తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. ప్రభుత్వం కూలగొడతాం అనే వారికి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని నిర్ణయించేది ఆదిష్ఠానమేనన్నారు. లోక్‌సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని అన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని