logo

ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం

ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్‌ అన్నారు.

Updated : 23 Apr 2024 06:21 IST

ఆచార్య కోదండరామ్‌

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆచార్య కోదండరామ్‌

కొడంగల్‌, న్యూస్‌టుడే: ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం సంగాయిపల్లి గ్రామంలో విశ్రాంత ఉపాధ్యాయుడు హన్మయ్య వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన  గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సెల్‌ఫోన్లు, టీవీలు లేవని,  గ్రంథాలయాలకు వచ్చే పత్రికలు, పుస్తకాలు చదవడం వల్లే సమాచారం తెలిసేదన్నారు. వీటి ఆధారంగా ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరారని పేర్కొన్నారు. రూ.30 లక్షలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే చదువే ముఖ్యమని చెప్పారు. అనంతరం హన్మయ్య తల్లి శివమ్మ విగ్రహాన్ని కోదండరామ్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్‌, భాస్కర్‌, సాయిరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని