logo

ఎన్నికల సంఘం వాట్సాప్‌ ఛానల్‌...

సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటోంది ఎన్నికల సంఘం. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది.

Published : 28 Apr 2024 03:07 IST

సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటోంది ఎన్నికల సంఘం. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. ప్రజలు ఎక్కువగా వినియోగించే వాట్సాప్‌ను ఉపయోగించుకోవాలని ఈసీ నిర్ణయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎలక్షన్‌ కమిషన్‌ పేరిట వాట్సాప్‌ ఛానల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిద్వారా వివిధ రకాల సమాచారాలను ఓటర్లకు చేరవేస్తున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలు, అవగాహన కల్పించే చిత్రాలు, వీడియోలు, వివిధ యాప్‌ల వివరాలను అందులో పొందుపర్చారు. సీ-విజిల్‌, సువిధ, సాక్ష్యం, కేవైసీ, తదితర యాప్‌లు, ఎన్నికలకు సంబంధించి సమగ్ర వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

న్యూస్‌టుడే, పాపన్నపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు