logo

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే పురోగతి

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే మెదక్‌ అభివృద్ధి జరుగుతుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.

Updated : 28 Apr 2024 06:21 IST

చేగుంటలో మాట్లాడుతున్న మైనంపల్లి హనుమంతరావు, చిత్రంలో లోక్‌సభ అభ్యర్థి నీలం మధు

చేగుంట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే మెదక్‌ అభివృద్ధి జరుగుతుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. చేగుంట, నార్సింగిలో శనివారం మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కాంగ్రెస్‌ నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని దేవుళ్లను పూజిస్తుందని,  భాజపా మాత్రం దేవుళ్ల పేరుచెప్పి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. భాజపా, భారాసను నమ్మితే నట్టేట మునగడం ఖాయం అన్నారు. పేదలు ఎంతో మంది ఉన్నారని, వారికి రెండు పడక గదుల ఇళ్లను ఇవ్వలేదన్నారు. అలాగే దళితబంధు, బీసీ బంధు కూడా ఇవ్వకుండా భారాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. నీలం మధును ఎంపీగా గెలిపిస్తే మళ్లి అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. లోక్‌సభ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. గెలిచిన వెంటనే నార్సింగిలో జాతీయ రహదారిపై ఉపరితల వంతెనను మూడు నెలల్లోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నార్సింగిలో ఎంపీటీసీ సభ్యుడు మైలారం సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు అంచనూరి రాజేశ్‌ భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. సమావేశంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్‌, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, రెండు మండలాల పార్టీ అధ్యక్షులు నవీన్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షులు గోవర్ధన్‌, నాయకులు, వెంగళరావు, భాస్కర్‌, భాగ్యరాజ్‌, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని