logo

బత్తుల లక్ష్మారెడ్డి అనే నేను..

మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి విజయం సాధించారు.

Published : 16 Dec 2023 05:43 IST

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి విజయం సాధించారు. గెలుపు పత్రం అందుకున్నప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన మొదటి రోజు అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజున హాజరు కాలేకపోయారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులతో కలిసి అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, లక్ష్మారెడ్డి సతీమణి మాధవి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్‌, చలపతిరావు, ఇజ్రాయిల్‌, రవీందర్‌రెడ్డి, గుండు నరేందర్‌, లింగయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని