logo

1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు

ఫ్లోరైడ్‌కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్‌సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.

Published : 24 Apr 2024 02:19 IST

ఫ్లోరైడ్‌కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్‌సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం 2,77,336 ఓట్లు సాధించి గెలుపొందారు. ఇక ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి 2,05,579 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి తిరునగరు గంగాధర్‌ 1,99,282 ఓట్లు సాధించారు. వీరిలో ఇంద్రసేనారెడ్డి విజయానికి 71,757 ఓట్లు, గంగాధర్‌ విజయానికి 78,054 ఓట్లు మాత్రమే తగ్గాయి. అధిక మంది స్వతంత్రులు బరిలో నిలవడం లక్షకు పైగా ఓట్లు సాధించడంతో వీరి విజయాలకు గండి పడిందని అప్పట్లో చర్చలు జరిగాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ తెదేపా (లక్ష్మి పార్వతి) అభ్యర్థి నరేందర్‌రెడ్డి 22,994 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థుల్లో మద్దిమడుగు కోటయ్య అత్యధికంగా 4,027 ఓట్లు సాధించారు. స్వతంత్రుల్లో మూడు వేల ఓట్లకు పైగా ఒకరు, రెండు వేల ఓట్లకు పైగా ముగ్గురు, వెయ్యికి పైగా ఓట్లు 14 మంది, 900 పైగా ఓట్లు 8 మంది సాధించారు.

మిర్యాలగూడ పట్టణం:

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని