logo

పార్టీ గుర్తుల చరిత్ర ఇదే

రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది.

Updated : 24 Apr 2024 06:26 IST

రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో తొలి ఎన్నికల నుంచే పార్టీ గుర్తులను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఓటర్లలో అక్షరాస్యులు కేవలం 16 శాతం మాత్రమే ఉండడంతో అభ్యర్థుల పేర్లు చదవడం కష్టమని భావించిన నాటి అధికారులు అందరూ గుర్తు పట్టేలా చిహ్నాలను ప్రవేశపెట్టారు. ఈ గుర్తులను గీయడానికి ఎన్నికల సంఘం ఎంఎస్‌ సేథీ అనే చిత్రకారుడిని నియమించింది. 1951 నుంచి 1992 వరకు ఆయన ఎన్నో వేల చిత్రాలను పెన్సిల్‌తో గీశారు. కొన్ని సాంకేతిక మార్పులతో ఇప్పటికీ ఇవే గుర్తులను ఎన్నికల కోసం వాడుతున్నారు.

న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని