logo

త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్‌రెడ్డి

భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్‌ భువనగిరి లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు.

Published : 29 Apr 2024 04:18 IST

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి గజమాలతో సత్కారం

బీబీనగర్‌, న్యూస్‌టుడే: భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్‌ భువనగిరి లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రం బీబీనగర్‌లోని పోచంపల్లి చౌరస్తాలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తాను హోంమంత్రిని అయితే కేసీఆర్‌ కుటుంబాన్ని జైలుకు పంపిస్తానన్నారు.  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అనేక మలుపులు తిరుగుతోందని, త్వరలో కోర్టులో రుజువైతే 30 మంది భారాస ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.వేల కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం, భువనగిరి ప్రాంత అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించలేదని అన్నారు. ఆగస్టు 15లోగా ఒకే దఫాలో రుణమాఫీని ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. తనను ఎంపీగా గెలిపించి లోక్‌సభకు పంపిస్తే, ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తానని అన్నారు. తొలుత బీబీనగర్‌లోని పీఆర్‌జీ గార్డెన్స్‌ నుంచి పోచంపల్లి కూడలి వరకు కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామాంజనేయులుగౌడ్‌, శ్యామ్‌గౌడ్‌, సత్తిరెడ్డి, నరేందర్‌రెడ్డి, బాలకృష్ణ, వేణుగౌడ్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని