logo

పోలీసులకూ అనుమతి లేదు సుమా..!

మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి.

Published : 02 May 2024 03:17 IST

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. ఎన్నికల నియమావళి గీత దాటితే కేసులు నమోదు చేస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా నడిపించేందుకు అన్ని రకాలుగా కీలకపాత్ర పోషిస్తారు. అలాంటి పోలీసులు పోలింగ్‌ కేంద్రాలకు పోయేందుకు అనుమతి లేదు తెలుసా..!

  • పోలింగ్‌ జరుగుతున్న సమయంలో పోలింగ్‌ కేంద్రంలో ఎలాంటి సమస్య వచ్చినా సాధ్యమైనంత వరకు కేంద్రంలోని ఎన్నికల అధికారే తన సిబ్బందితో ఆయా సమస్యలను పరిష్కరించుకొంటారు. శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ప్రత్యేక కారణం లేకుండా పోలీసులు బూత్‌లోకి పోవడానికి అనుమతి లేదు.
  • పోటీ చేసే అభ్యర్థి అయినా, ఇంకా ముఖ్యమైన వ్యక్తి ఓటు వేసేందుకు వచ్చినా భద్రత సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పనీ ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ, వారి అనుచరులు కానీ చేయరాదు.
  • పోటీలో ఉన్న అభ్యర్థి జడ్‌ ప్లస్‌ కేటగిరి రక్షణ ఉన్నా.. వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బంది ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్‌ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకూడదు.
  • పోలింగ్‌ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలు పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం అనుమతి పత్రం ఉంటేనే కేంద్రంలోకి అనుమతించాలి.
  • పదవుల్లో ఉన్నవారు, పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించకూడదు. ఎలాంటి మాటలు, సైగలు చేసినా నేరంగా పరిగణిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని