logo

నామపత్రాల ధరావతు ఎందుకు పెంచారంటే..

ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.

Published : 20 Apr 2024 04:37 IST

కందుకూరు, గుడ్లూరు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. గతంలో ఈ నామినేషన్లు వేసేందుకు ఫీజు చాలా తక్కువగా ఉండేది. సాధారణ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు  రూ.250 చెల్లిస్తే సరిపోయేది. అదే శాసనసభకు పోటీ చేసేందుకు సాధారణ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.125 చెల్లించాల్సి వచ్చేది.

ఫ్లోరైడ్‌ బాధితులు, రైతులు తమ ఉద్యమంలో భాగంగా 1996లో  జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి  537 మంది  నామినేషన్లు వేశారు. పరిశీలన అనంతరం 480 మంది బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి పెద్ద సవాలుగా మారింది. ఎన్నికలను నెల రోజులు వాయిదా వేసి బుక్‌లెట్‌ రూపంలో బ్యాలెట్‌ పత్రం రూపొందించి ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కూడా రెండు రోజులు పట్టింది. దీని తర్వాత ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా నామినేషను డిపాజిట్లు పెంచింది. లోక్‌సభకు పోటీ చేసే వారికి రూ.500 నుంచి రూ.25వేలకు, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 నుంచి రూ.12,500కు పెంచింది. శాసనసభకు పోటీ చేసే వారికి రూ.250 నుంచి రూ.పది వేలకు, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 నుంచి రూ.అయిదు వేలకు పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని