logo

జిల్లా ఓటర్లు 19,44,874

జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. నియోజకవర్గాల వారీగా ఓటుహక్కు వినియోగించుకునే వారి తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో గత జననవరి 22వ తేదీ నాటికి 19,08,498 ఉండగా- తాజా జాబితా ప్రకారం ఆ సంఖ్య పెరిగింది.

Published : 03 May 2024 03:07 IST

తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఈనాడు, నెల్లూరు

జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. నియోజకవర్గాల వారీగా ఓటుహక్కు వినియోగించుకునే వారి తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో గత జననవరి 22వ తేదీ నాటికి 19,08,498 ఉండగా- తాజా జాబితా ప్రకారం ఆ సంఖ్య పెరిగింది. 36,376 మందికి అదనంగా తుది జాబితాలో చోటు దక్కింది. 2019 ఎన్నికలతో పోల్చితే.. కావలి నియోజకవర్గంలో ఓటర్లు తగ్గగా- నెల్లూరు రూరల్‌, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పెరగడం  గమనార్హం. నెల్లూరు నగరంలో అత్యల్పంగా 750 ఓట్లు మాత్రమే పెరిగాయి.

భారీగా మార్పులు

ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో దొంగ ఓటర్లను చేర్చడంతో పాటు.. ప్రతిపక్షాల ఓట్ల తొలగింపునకు వైకాపా యత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో తెదేపా నాయకులు పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. దాంతో గత జనవరి నాటికి జిల్లాలో చనిపోయిన వారి ఓట్లు 39,479, డూప్లికేట్‌ 12,830, శాశ్వతంగా వలస వెళ్లిన 72,329, చిరునామాలు సరిదిద్దినవి 26,646, ఒకే ఇంటి నంబరుతో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నవి 55,214 గుర్తించి సరిచేశారు. దీంతో పాటు.. ఆ తర్వాత వచ్చిన ఫారం-6, 7, 8 దరఖాస్తులను పరిశీలించారు. నామినేషన్ల తేదీ వరకు కొత్తగా ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. కొత్తగా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కావలిలో ఎక్కువగా దొంగ ఓట్లు చేరుస్తున్నారని ప్రచారం జరగడం, ఒకే వ్యక్తి పేరుతో వందల సంఖ్యలో ఫారం- 7 దరఖాస్తులు చేయడం వెలుగు చూశాయి. ఆ నేపథ్యంలో గత ఎన్నికలతో పోల్చితే.. ఈ నియోజకవర్గంలో సుమారు 16,726 తగ్గాయి. ఇది ఎవరిపై ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి స్థానికుల్లో నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని