logo

గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి

గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్‌ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు

Published : 23 Apr 2024 04:49 IST

వేమిరెడ్డిని సన్మానిస్తున్న గ్రామస్థులు
అల్లూరు, న్యూస్‌టుడే: గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్‌ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు. దేవాలయాలు, మసీˆదులో పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  గ్రామస్థులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు వేమిరెడ్డి కోటారెడ్డి, బీద గిరిధర్‌, దినీత్‌రెడ్డి, బండి శ్రీనివాసులురెడ్డి, అంబటి రాజేంద్ర, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డాక్యుమెంటరీ తీయాలి : కార్యక్రమంలో పాల్గొన్న జబర్దస్త్‌ నటుడు ఆర్పీ మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ తీయాలనుందన్నారు.

 కాకర్ల భారీ ప్రదర్శన

 ఉదయగిరి, దుత్తలూరు : ఉదయగిరి తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్‌ సోమవారం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య నామినేషన్‌ దాఖలు చేశారు. వింజమూరులోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. ఆపై బొమ్మరాజుచెరువు వద్ద కార్యాలయం నుంచి  ర్యాలీగా కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, నాయకులు పి.చెంచలబాబుయాదవ్‌, మేకపాటి శాంతికుమారి, మన్నేటి వెంకటరెడ్డితోపాటు తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు, అభిమానులతో కలిసి ఉదయగిరి బస్టాండు సెంటర్‌ చేరుకున్నారు.  నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజా రమేష్‌ ప్రేమ్‌కుమార్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అనంతరం అబ్దుల్‌ ఖాదర్‌ఖాన్‌ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు.

తెదేపాలో చేరికలు

లింగసముద్రం : రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని కందుకూరు ఉమ్మడి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం తిమ్మారెడ్డిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు నీలం బ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో వైకాపాను వీడి తెదేపా చేశారు. వారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. కార్యక్రమంలో అడపా రంగయ్య, మధు, మాజీ ఎంపీపీ బాలకోటయ్య పాల్గొన్నారు. ‌్ర పెదపవనికి చెందిన పలువురు ముస్లింలు వైకాపాను వీడి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెదేపాలో చేశారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య, నాయబ్‌ రసూల్‌, నాయబ్‌ పాల్గొన్నారు.

వైకాపా ఎంపీˆటీసీˆ సభ్యుడు..

బిట్రగుంట :  బోగోలు మూడో ఎంపీˆటీసీˆ వల్లాకి స్వరూప (వైకాపా) తెదేపాలో చేరారు. సోమవారం కృష్ణారెడ్డి పార్టీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.   తాళ్లూరు పంచాయతీ వార్డు సభ్యుడు కె.హజరత్తయ్య కూడా చేరారు.

ఆడంబరంగా పసుపులేటి నామినేషన్‌

కావలి : స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్‌ సోమవారం ఆడంబరంగా నామినేషన్‌ వేశారు. పట్టణంలోని ట్రంకురోడ్డులో భారీ జనసమీకరణతో గుర్రంపై ర్యాలీగా వెళ్లారు. ఆయనతోపాటు సతీమణి సుగుణ కూడా రెండేసి సెట్ల నామినేషన్లు ఆర్వో వీకే శీనానాయక్‌కు అందజేశారు. జైభారత్‌ జాతీయ పార్టీ తరఫున ఎం.నరేంద్ర, స్వతంత్ర అభ్యర్థులుగా అనుమాలశెట్టి హరిప్రసాద్‌, రాచూరు వెంకట సుబ్బారావులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రావణ్‌ నామపత్రాల్లో తప్పులుండడంతో సవరించి తీసుకురావాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని