logo

ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు.

Published : 23 Apr 2024 04:59 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలకసంస్థలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాత్రివేళల్లో కూడా తనిఖీలు ముమ్మరంగా చేపట్టి అక్రమంగా రవాణా అవుతున్న వాటిని సీజ్‌ చేయాలన్నారు. గూడ్స్‌ వాహనాలు, కంటైనర్లు, బస్సులు, లారీలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎపిక్‌ కార్డుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ సంజన సింహ, డీఆర్వో లవన్న, నోడల్‌ అధికారులు బాపిరెడ్డి, పద్మావతి, కన్నమనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని