logo

పసుపు దళం.. విజయగళం

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 23 Apr 2024 05:14 IST

నాలుగో రోజు 32 మంది అభ్యర్థుల దాఖలు

 నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

 

కలెక్టర్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న వేమిరెడ్డి

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 32 మంది అభ్యర్థులు 44 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థి కొప్పాల రఘు ఒక సెట్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి హరినారాయణన్‌కు అందజేశారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని ఆర్వో కేంద్రాల్లో నామినేషన్లు అందజేశారు.

ఆర్వో వికాస్‌ మర్మత్‌కు అందిస్తున్న నారాయణ

కూటమి ఉత్సాహం..

ఎన్డీయే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమం సమరోత్సాహంతో జరిగింది. ఆయా నియోజకవర్గాల నుంచి తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాహనాల్లో పెద్దఎత్తున కదిలొచ్చారు. భారీ ర్యాలీల్లో కదం తొక్కొరు. నాయకులు దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ.. కోలాహలం మధ్య నామినేషన్ల వేశారు. నెల్లూరులోని కలెక్టరేట్‌, నగరపాలక సంస్థ కార్యాలయం, ఆత్మకూరు, ఉదయగిరి ఆర్వో కార్యాలయాల పరిసరాలు పసుపుమయంగా మారాయి. కూటమి జెండాలు రెపరెపలాడాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని