logo

పోలింగ్‌ కేంద్రాలకు అధికారుల కేటాయింపు

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్‌ విధులకు పోలింగ్‌ సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్‌లో రెండో విడత మ్యాన్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ ర్యాండమైజేషన్‌ను సాధారణ పరిశీలకులు నితిన్‌ సింగ్‌ బదారియ,

Published : 29 Apr 2024 03:52 IST

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్‌ విధులకు పోలింగ్‌ సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్‌లో రెండో విడత మ్యాన్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ ర్యాండమైజేషన్‌ను సాధారణ పరిశీలకులు నితిన్‌ సింగ్‌ బదారియ, రామ్‌కుమార్‌గౌతమ్‌ సమక్షంలో కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ అధికారుల కేటాయింపు, రిజర్వ్‌ సిబ్బందిని ఆన్‌లైన్‌ ద్వారా ర్యాండమైజేషన్‌ చేసి కేటాయించారు. వీరంతా వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ సంజనా సింహా, డీఆర్వో లవన్న, సీపీవో సాల్మన్‌రాజు, ఎన్‌ఐసీ డీఐవో సురేష్‌కుమార్‌, కలెక్టరేట్‌ అధికారులు సుబ్రహ్మణ్యం, మధుసూదనశర్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని