logo

పేపరుమిల్లు ఉద్యోగుల సమస్యతో రాజకీయం

జయపురం పేపరు మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినిపతి విఫలమయ్యారని బిజద మాజీ మంత్రి రబినారాయణ నందో ఆరోపించారు.

Published : 28 Apr 2024 06:45 IST

నేతల పరస్పర ఆరోపణలు

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రబినారాయణ నందో

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పేపరు మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినిపతి విఫలమయ్యారని బిజద మాజీ మంత్రి రబినారాయణ నందో ఆరోపించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా బాహినిపతి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తన భార్య డా।।ఇందిరా నందోను గెలిపిస్తే రథయాత్రలోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జయపురంలో ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.  

ఎమ్మెల్యే తారాప్రసాద్‌

ఎమ్మెల్యే తారాప్రసాద్‌ తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో పేపరుమిల్లులో ఎలాంటి సమస్యలు లేవని, రబి నారాయణ 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మొదలయ్యాయన్నారు. 2014లో తాను గెలిచిన తరువాత ప్రభుత్వంతో పోరాడి 400 మంది ఉద్యోగులకు ఈపీఎఫ్‌ ఇప్పించామన్నారు. ఈ సమస్యపై దాదాపు 20 సార్లు యాజమాన్యంతో, మూడుసార్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమైనట్లు పేర్కొన్నారు. చేనేతశాఖ మంత్రి, జల వనరుల మంత్రి, విద్యుదత్తుశాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు రబినారాయణ ఎన్నిసార్లు అసెంబ్లీలో ఈ సమస్య ప్రస్తావించారని ప్రశ్నించారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని