logo

నేడు నడ్డా, రాహుల్‌ రాక

రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. అగ్రనేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హోంమంత్రి అమిత్‌షా పర్యటించి వెళ్లిన వెంటనే భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదివారం సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటారు.

Published : 28 Apr 2024 06:49 IST

జె.పి.నడ్డా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. అగ్రనేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హోంమంత్రి అమిత్‌షా పర్యటించి వెళ్లిన వెంటనే భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదివారం సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటారు. 5.30 గంటలకు హెలికాప్టర్‌లో రొంగాయిలొండ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి బ్రహ్మపుర, గోపాలపూర్‌కు మధ్యలో అంబపువలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి బ్రహ్మపురలో ఉండి సోమవారం దిల్లీ వెళ్లిపోతారు. మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదివారం ఉదయం 11.30 గంటలకు భువనేశ్వర్‌లో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కటక్‌ జిల్లా సత్యభామాపాలెం వెళతారు. అక్కడ మధుసూదన్‌ దాస్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పింస్తారు. తర్వా సాలెపూర్‌ 12.45 గంటలకు వెళతారు. అక్కడ రోడ్‌షో నిర్వహిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

రాహుల్‌ గాంధీ

పూరీకి ప్రధాని మోదీ

నడ్డా వెళ్లిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పూరీ వస్తారని భాజపా వర్గాల ద్వారా తెలిసింది. ఆయన పురుషోత్తమ దర్శనం చేసుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం భువనేశ్వర్‌లో ఏర్పాటయ్యే మరో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు దశలవారీగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని