logo

పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ

పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్‌ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది.

Published : 29 Apr 2024 04:30 IST


సిమిలిగుడ, న్యూస్‌టుడే: పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్‌ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. పొట్టంగిలో ఈసారి పదిమంది నామినేషన్లు వేయగా అందులో అధికంగా స్వతంత్ర అభ్యర్థులున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి జయరామ్‌ పంగి కుమార్తె అంబికా గతంలో జిల్లా పరిషత్‌ సభ్యురాలిగా, సమితి సభ్యురాలిగా చేశారు. ప్రస్తుతం ఆమె పెద్దనాన్న కుమారుడు ప్రఫుల్ల బిజద తరఫున పోటీ చేస్తుండగా, అంబికా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. దీంతో పొట్టంగిలో అన్నాచెల్లెలి మధ్య పోటీ నెలకొంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఇక్కడ ఓట్లు చీలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంబికా కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ప్రఫుల్ల తన చెల్లిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. అంబికా పోటీ నుంచి తప్పుకుంటారో, అన్నతో తలపడతారో వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని