logo

ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్‌

నవరంగపూర్‌ జిల్లాలో రాజకీయ పార్టీల ఎన్నికల సమావేశాలకు హాజరైనందుకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.

Published : 29 Apr 2024 15:55 IST

నవరంగపూర్‌: నవరంగపూర్‌ జిల్లాలో రాజకీయ పార్టీల ఎన్నికల సమావేశాలకు హాజరైనందుకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘింంచినందుకు జిల్లా ఎన్నికల కమీషనర్, కలెక్టర్ డా. కమల్‌లోచన్‌ మిశ్రా వారిని సోమవారం ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయులు పపదహండి సమితి, పితారిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌతమ్ చరణ్ సాహూ, డాబుగావ్ సమితి పూజారిగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోజ్ కుమర్ పాత్ర్‌గా గుర్తించారు. ఇద్దరు ఉపాధ్యాయులు రాజకీయ పార్టీలకు మద్దతిస్తూ, ప్రచార కార్యక్రమంలో పాల్గొనటం వల్ల చర్యలు తీసుకున్నట్టు పాలనాధికారి మిశ్రా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని