logo

పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ

పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్‌ 600కు 592, ఎం.హర్షవర్థన్‌ 592, కె.రాకేష్‌ 590 మార్కులు సాధించారు.

Published : 23 Apr 2024 03:25 IST

దో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్‌ 600కు 592, ఎం.హర్షవర్థన్‌ 592, కె.రాకేష్‌ 590 మార్కులు సాధించారు. గజపతినగరం మండలంలో మరుపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన ఇమంది తపస్వినికి 588, గంట్యాడలో నరవ జ్యోతిభా గురుకుల పాఠశాలకు చెందిన గోపిశెట్టి తరుణి 589, దత్తిరాజేరులో షికారుగంజి ఆదర్శ పాఠశాలకు చెందిన టి.గాయత్రి 586, దత్తిరాజేరులో ఆదర్శ పాఠశాల విద్యార్థిని తలారి గాయత్రి 586, బొబ్బిలిలో దిబ్బగుడివలసకు చెందిన చింతల శ్రీకీర్తి 585, బాడంగి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జైగణేష్‌ 585, వంగర జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పాలవలస యామిని 585, రామభద్రపురంలో కొట్టక్కి పాఠశాలకు చెందిన శ్యామ్‌సిరి 580 మార్కులతో.. ఆయా మండలాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. గరివిడి మండలంలోని 10 జడ్పీ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ నుంచి మొత్తం 515 మంది విద్యార్థులకు 463 మంది, సంతకవిటి మండలంలో 10 ప్రభుత్వ పాఠశాల్లోని 630 మందికి 600 మంది, గుర్ల మండలంలో 13 ఉన్నత పాఠశాలల్లో 642 మంది పరీక్షలు రాయగా 584 మంది పాసయ్యారు. రేగిడి మండల పరిధిలో 96.73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. చీపురుపల్లిలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లో 776 మందికి 698 మంది పాసయ్యారు. రాజాంలోని డోలపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 165 మందిలో 139, రాజాం జడ్పీ ఉన్నత పాఠశాలలో 228 మందికి 189, సారథి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 55 మంది పరీక్షలకు హాజరవగా 46 మంది ఉత్తీర్ణులయ్యారు.

న్యూస్‌టుడే బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని