logo

ట్రాఫిక్‌ నియంత్రణ కత్తిమీద సామే

నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Published : 23 Apr 2024 03:29 IST

సిద్ధం సభ నేపథ్యంలో పోలీసులపై ఒత్తిడి
జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక

సభకు రెండు రహదారుల మధ్య ఏర్పాట్లు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా మార్గాల గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ ప్రాంతానికి ఆనుకునే అనేక విద్యా సంస్థలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నియంత్రణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది.

ఆ బాధ్యత మీదే..

‘ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసే బాధ్యత మీదే. ఏమాత్రం విఫలమైనా ఇబ్బందులకు గురవ్వాల్సి ఉంటుంది. బదిలీ అయ్యే అవకాశమూ లేకపోలేదు. అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అంటూ కిందిస్థాయి సిబ్బందికి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు సైతం జారీ చేశారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం సభా వేదికను డీఐజీ విశాల్‌ గున్ని, ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ పరిశీలించారు. సీఎం కోసం సిద్ధం చేసిన బస్సును పరిశీలించి, ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు.

అమ్మో.. కెమెరాలా..

సభా వేదికను పరిశీలించేందుకు, ఫొటోలు తీసేందుకు అక్కడి పోలీసులతో పాటు ఇప్పటికే కాపుగాసిన కొందరు ప్రైవేటు వ్యక్తులు ఒప్పుకోవడం లేదు. కెమెరా కనిపిస్తే తీవ్ర అభద్రతా భావంతో మండిపడుతున్నారు. సోమవారం పలు పత్రికల విలేకరులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఓ పత్రికతో పాటు ఛానల్‌ వారిని మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండానే విడిచిపెడుతుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని