logo

పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు చర్యలు

స్వీప్‌ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు.

Published : 28 Apr 2024 04:44 IST

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, అధికారులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: స్వీప్‌ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే గోడప్రతులను శనివారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అన్ని సచివాలయాలు, ఆర్టీసీ బస్సులు, గ్రామాల్లోని ఖాళీ గోడలపై అంటించి అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్‌ శాతం పెంపుపై దృష్టి సారించామని చెప్పారు. కలెక్టరేట్‌ వద్ద సెల్ఫీ పాయింట్‌, మోడల్‌ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు, ఫ్లాష్‌ మాబ్‌ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. సహాయక కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డీఆర్వో అనిత, స్వీప్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నియోజకవర్గాల కేటాయింపు: విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గాలకు అవసరమైన పీవో, ఏపీవో, ఓపీవోల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు హనీష్‌ చాబ్రా, సీతారాం జాట్‌, కలెక్టర్‌ నాగలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో కేటాయింపు సాగింది. 12,522 మందిలో 2087 మంది పీవోలు, ఏపీవోలు ఉన్నారు. జేసీ కార్తీక్‌, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డీఆర్వో అనిత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని