logo

కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్‌

రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు.

Published : 28 Apr 2024 04:44 IST

మాట్లాడుతున్న నాగార్జున, చిత్రంలో కలిశెట్టి, అదితి, యశస్వి

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. శనివారం అశోక్‌బంగ్లాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, కక్ష పూరిత చర్యలేనన్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలను అణగదొక్కాలనే ఆలోచన తప్ప.. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టేశారని మండిపడ్డారు. దీంతో అన్ని రంగాల్లో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి, రూ.100 వసూలు చేశారని విమర్శించారు. పన్నులు, ధరలు పెంచి దోచేశారన్నారు. ఓటర్లు ఆలోచించి, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిని అదితి గజపతిరాజు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి, మాజీ ఎమ్మెల్యే కేఏ.నాయుడు, భాజపా నాయకులు ఎస్‌.లక్ష్మీనరసింహం, ఇమంది సుధీర్‌, తెదేపా రాష్ట్ర పరిశీలకుడు కర్రోతు నర్సింగరావు పాల్గొన్నారు.

మీసాల గీతతో సమావేశం

ఈనాడు, విజయనగరం: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూటమి విజయం అవసరమని, దీనికి గానూ నాయకులంతా సహకరించాలని విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున కోరారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను శనివారం ఆమె నివాసంలో కలిశారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో చర్చించారు. పార్టీ పరంగా అండగా ఉంటామని, అధినేతతో మాట్లాడాలని కోరారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని