logo

5, 6, 7వ తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌

సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు.

Published : 29 Apr 2024 05:17 IST

సూచనలు చేస్తున్న ప్రమోద్‌కుమార్‌ మెహర్ద, చిత్రంలో కలెక్టర్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్‌కుమార్‌ మెహర్ద పరిశీలించారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించాలని కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌, సహాయ పోలింగ్‌ అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది మే 5న, పోలీసులు మే 6న, ఇతర శాఖల సిబ్బంది మే 7న పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో వీలు లేకపోతే మూడు రోజుల్లో ఏదో ఒకరోజు వినియోగించుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని