logo

సమన్వయంతో పనిచేయాలి

ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 29 Apr 2024 05:19 IST

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కౌంటర్ల ఏర్పాటు, విధులు, సదుపాయాలు, పార్కింగ్‌ తదితర అంశాలను వివరించారు. ఈవీఎం, సామగ్రితో తిరిగి వచ్చేవారికి రిసెప్షన్‌ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఒక్కో సెంటర్‌కు ఇద్దరు జిల్లా అధికారులను నియమించినట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రమైన జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయానికి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సుధారాణి, జడ్పీ ఉప సీఈవో రాజ్‌కుమార్‌, లెండి కళాశాలకు మెప్మా పీడీ సుధాకర్‌, గృహనిర్మాణశాఖ పీడీ శ్రీనివాసరావును నియమించామన్నారు. స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను నిర్దేశించిన విధంగా భద్రపరచాలని, సెక్టార్‌ అధికారుల కౌంటర్లలో రిజర్వ్‌డ్‌ ఈవీఎంలను అందజేయాలన్నారు. సంయుక్త కలెక్టర్‌ కె.కార్తీక్‌, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డీఆర్వో ఎస్‌.డి.అనిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని