logo

అంతా ఓకేనా.. ఓ సెల్ఫీ తీసుకుందాం

సాలూరు మండలం కురుకుట్టి, సారిక పంచాయతీల్లో బుధవారం ప్రచారం చేసిన  కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణితో పలువురు యువతులు స్వీయ చిత్రాలు తీసుకొని సందడి చేశారు.  

Published : 02 May 2024 04:03 IST

న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం: సాలూరు మండలం కురుకుట్టి, సారిక పంచాయతీల్లో బుధవారం ప్రచారం చేసిన  కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణితో పలువురు యువతులు స్వీయ చిత్రాలు తీసుకొని సందడి చేశారు.  


చిట్టితల్లి బాధ్యత.. మాది

న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి, కొత్తగూడ, గాజులగూడలో బుధవారం కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థిని జగదీశ్వరి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఎత్తుకుని కుటుంబ సభ్యులను ఓట్లు అడిగారు.


తాటిముంజు.. నా ఓటు మీకే

న్యూస్‌టుడే, బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలోని 17వ వార్డులో కూటమి అభ్యర్థి బేబినాయనకు స్థానికులు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఓ కార్మికుడి దగ్గర తాటిముంజు తీసుకుని.. ఓటు వేయమని ఆయన అభ్యర్థించారు.


‘గాజు గ్లాసు’ గుర్తుంచుకోండి

న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం: పాలకొండలో కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని తెదేపా నాయకులు ఇంటింటి  ప్రచారం చేశారు. ఓటర్లను కలసి ‘గాజు గ్లాసు’ గుర్తును చూపించి ఓటేయాలని కోరారు.


వేయ్‌.. విజయ‘దరువు’

న్యూస్‌టుడే, బలిజిపేట: బలిజిపేట మండలంలోని గేదెలపేట, శ్రీరంగరాజపురం, నారన్నాయుడువలస, గంగాడ గ్రామాల్లో కూటమి అభ్యర్థి బి.విజయచంద్ర డ[ప్పు కొడుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు.  


నాకే తెలుసు.. మీ కష్టాలు

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌: విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని పూసపాటి అదితి గజపతిరాజు బుధవారం దాసన్నపేటలోని కుమ్మరివీధిలో పర్యటిస్తూ కుండలు, మట్టి సామగ్రి తయారీ విధానాన్ని పరిశీలించారు. అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని