logo

పింఛను దారుల అవస్థలు

బలిజిపేట యూనియన్, స్టేట్‌బ్యాంకు, విశాఖ గ్రామీణ బ్యాంకుశాఖలు గురువారం సామాజిక పింఛనుదారులతో కిటకిటలాడాయి.

Updated : 02 May 2024 17:39 IST

బలిజిపేట: బలిజిపేట యూనియన్, స్టేట్‌బ్యాంకు, విశాఖ గ్రామీణ బ్యాంకుశాఖలు గురువారం సామాజిక పింఛనుదారులతో కిటకిటలాడాయి. పింఛనుదారులంతా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మే, జూన్‌ నెలల్లో వారి బ్యాంకు ఖాతాల ద్వారా నగదును పొందాల్సి ఉంది. వాస్తవానికి గ్రామాల్లో బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులు రెండు, మూడు నెలల్లో ఒక్కసారి కూడా బ్యాంకునకు వెళ్లి ఉండరు. దీంతో వారి ఖాతాలు ఇన్‌ ఏక్టిట్‌లో ఉండిపోయాయి. వీటిని సవరించుకునేందుకు ఒక్కసారిగా వివిధ గ్రామాల పింఛనుదారులు బ్యాంకు శాఖలను చుట్టిముట్టడంతో బ్యాంకు కిటకిటలాడింది. సరైన సదుపాయాలు లేక వారు అవస్థలు పడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని