logo

చేపల వేట.. చెరువుకే చేటంట

చేపల వేట కోసం ఏకంగా చెరువుకే చేటు తెచ్చిన వైనమిది. సంతనూతలపాడు మండలం ఎనికపాడులో మంచినీటి చెరువు పక్కన సుమారు 32 ఎకరాల్లో మరొకటి ఉంది.

Published : 02 Jul 2023 02:09 IST

జేసీబీతో చెరువు కట్టను తొలగిస్తున్న దృశ్యం

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: చేపల వేట కోసం ఏకంగా చెరువుకే చేటు తెచ్చిన వైనమిది. సంతనూతలపాడు మండలం ఎనికపాడులో మంచినీటి చెరువు పక్కన సుమారు 32 ఎకరాల్లో మరొకటి ఉంది. ఇందులో కొద్దిరోజుల క్రితం వరకు పుష్కలంగా నీరుండేది. చేపల పెంపకందారులు ఇటీవల వాటిని పట్టించేందుకు నిర్ణయించారు. దీంతో తూముల నుంచి బయటకు వదిలారు. ఇంకా 40 శాతం వరకు నీరు చెరువులో ఉండిపోయింది. చేపలు పట్టేందుకు వీలుపడదంటూ ఈ నీటిని బయటకు పంపేందుకు సిద్ధపడ్డారు. ఇందుకుగాను శనివారం సాయంత్రం ఏకంగా జేసీబీ సాయంతో కట్టను తొలగించే పని చేపట్టారు. సుమారు 10 నుంచి 15 అడుగుల వెడల్పు 15 అడుగుల ఎత్తు కలిగిన కట్టను తవ్వేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని తవ్వకం పనులను అడ్డుకున్నారు. చేపల వేట కోసం ఏకంగా కట్టను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు. నీరు ఖాళీ చేస్తే ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అడ్డుకునేందుకు కట్టపై గుమిగూడిన గ్రామస్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని