logo

శిద్దా ఇంట్లో దోపిడీకి విఫలయత్నం

మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి విఫలయత్నం జరిగింది. అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 28 Apr 2024 04:36 IST

శిద్దా తనయుడు సుధీర్‌బాబుతో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ శ్రీధర్‌రావు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి విఫలయత్నం జరిగింది. అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఇద్దరు ఆగంతకులు కత్తులతో శిద్దా రాఘవరావు ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. అక్కడ సెల్‌ఫోన్‌ చూస్తున్న కాపలాదారు కలవకొల్లు దుర్గాప్రసాద్‌పై లంఘించగా, ఆయన తీవ్రంగా ప్రతిఘటిస్తూ కేకలు వేయటంతో పక్కనే నిద్రిస్తున్న గన్‌మెన్‌ మోహన్‌ అప్రమత్తమయ్యారు. దీంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్‌కు సమాచారమందించగా వారు నేర స్థలాన్ని పరిశీలించారు. దొంగల కోసం గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం నేరస్థలాన్ని అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) శ్రీధర్‌రావు, ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు, సీఐ లక్ష్మణ్‌ సందర్శించారు. మాజీమంత్రి తనయుడు, తితిదే బోర్డు సభ్యుడు సుధీర్‌బాబుతో మాట్లాడి నేరస్థలంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు ఆగంతకులు కత్తులతో ప్రవేశించిన దృశ్యాలు వాటిలో నమోదయ్యాయి. వస్తువులేవీ చోరీకి గురికాలేదని, కాపలాదారు దుర్గాప్రసాద్‌కు సైతం గాయాలేమీ కాలేదని అదనపు ఎస్పీ శ్రీధర్‌రావు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు