logo

గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు

తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి.

Published : 29 Apr 2024 03:13 IST

శంకుస్థాపన సమయంలో నిర్మాణ సామగ్రితో నిండుగా కనిపిస్తున్న ప్రదేశం

తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ వెతలకు చరమగీతం పలకాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. రూ.22 కోట్ల అంచనా వ్యయంతో తాళ్లూరు మండలం గుంటిగంగ సమీపంలో 132/33 కె.వి.విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. అంతలోనే అధికారం మారి వైకాపా గద్దెనెక్కింది. 2019లో మరికొంత మొత్తం పెంచి 22.65 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. 2021 డిసెంబరు నాటికి పనులు పూర్తిచేసేలా ఓ సంస్థ పనులు దక్కించుకుంది. 2020 జనవరి 17న అప్పటి విద్యుత్తు శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పటికే రూ. కోట్ల విలువజేసే సామగ్రిని సిద్ధం చేశారు. పునాదుల కోసం గోతులు కూడా తీశారు. ఆ తర్వాత ఒక్క పని కూడా ముందుకు సాగలేదు. పట్టించుకున్నవారు లేకపోయారు. గుత్తేదారు సంస్థను మార్చి మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించినప్పటికీ పాలనా కాలం కాస్తా ముగింపునకు వచ్చేసింది.

ఈనాడు, ఒంగోలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని