logo

నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ గురువారంతో ముగియనుంది.

Published : 25 Apr 2024 04:31 IST

ఇచ్ఛాపురంలో కూటమి శ్రేణులతో కలిసి ర్యాలీగా నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న తెదేపా ఇచ్ఛాపురం ఎమెల్యే అభ్యర్థి బెందాళం అశోక్‌

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఆరు రోజుల నుంచి జిల్లాలోని 8 శాసనసభ, ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు నామపత్రాలను సమర్పించారు. ఇందులో భాగంగా బుధవారం 40 మంది అభ్యర్థులు.. 52 నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున వేశారు.

8 స్థానాలు.. 34 మంది అభ్యర్థులు..: 8 అసెంబ్లీ స్థానాల నుంచి 34 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తెదేపా తరఫున బెందాళం అశోక్‌(ఇచ్ఛాపురం), బెందాళం నీలోత్పల(ఇచ్ఛాపురం), మామిడి గోవిందరావు(పాతపట్నం), బగ్గు రమణమూర్తి(నరసన్నపేట), వైకాపా నుంచి పిరియా విజయ(ఇచ్ఛాపురం), పిరియా సాయిరాజ్‌(ఇచ్ఛాపురం), దువ్వాడ శ్రీనివాస్‌(టెక్కలి), ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం), గొర్లె కిరణ్‌కుమార్‌(ఎచ్చెర్ల), గొర్లె ప్రమీల(ఎచ్చెర్ల), ధర్మాన కృష్ణదాస్‌(నరసన్నపేట), ధర్మాన కృష్ణచైతన్య(నరసన్నపేట), భాజపా అభ్యర్థిగా నడుకుదటి ఈశ్వరరావు ఆర్వోకు నామపత్రాలు అందించారు. స్వతంత్ర అభ్యర్థులు కొందరు, ఇతర పార్టీల నుంచి మరికొందరు నామినేషన్లు వేశారు.      

26న పరిశీలన : జిల్లాలో దాఖలైన నామినేషన్ల పరిశీలన ఈ నెల 26న జరుగుతుందని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ తెలిపారు. 29న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంను ఆయన పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని