logo

సమన్వయంతో పని చేయండి

జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి సూచించారు.

Published : 28 Apr 2024 03:44 IST

ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి

మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి, చిత్రంలో కలెక్టర్‌  మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎస్పీ రాధిక, తదితరులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి సూచించారు. కలెక్టరేట్‌ నుంచి నోడల్‌ అధికారులతో శనివారం నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అధికారి ఎన్నికల నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. ఓటరు నిర్భయంగా తమ హక్కు వినియోగించుకునేలా చూడాలని, పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఒడిశా నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని, రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారిని నియంత్రించాలని చెప్పారు. ఇప్పటికే అలాంటి వారి జాబితాను ఆయా ఆర్వోలకు పంపినట్లు స్పష్టం చేశారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సామూన్‌ తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఎస్పీ రాధిక మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు రూ.4.32 కోట్ల విలువైన మద్యం, బంగారం, గంజాయి స్వాధీనం చేసుకున్నామని, 520 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు సందీప్‌కుమార్‌, సర్వజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా, పోలీసు పరిశీలకులు సచింద్ర పటేల్‌, దిగంబర్‌ పి.ప్రదాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని