logo

తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు

జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది.

Published : 29 Apr 2024 05:41 IST

కొత్తూరు: పొన్నుటూరులో తెదేపాలో చేరిన వారితో పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు

జి.సిగడాం, పొందూరు, కొత్తూరు, న్యూస్‌టుడే: జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం రాత్రి ఎచ్చెర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, తెదేపా విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో వైకాపా నుంచి కూటమిలోకి భారీగా చేరికలు జరిగాయి. వాండ్రంగి సర్పంచి సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు బూరాడ శ్రీదేవి, మాజీ సర్పంచి సనపల త్రినాథరావు, ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బూరాడ వెంకటరమణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రేగిడి రాంబాబు, ఉప సర్పంచి డబ్బాడ రామారావు, మీసాల అప్పారావుతో పాటు 300 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్‌, భాజపా మండల అధ్యక్షుడు వజ్జిపర్తి రఘురాం, కూటమి శ్రేణులు పాల్గొన్నాయి.

  • పొందూరు మండలం ధర్మపురం, వీఆర్‌గూడాం గ్రామాల నుంచి 70 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్‌ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ అన్నెపు రాము, సువ్వారి మధు, పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, గాడు నారాయణరావు, బలగ శంకర్‌భాస్కర్‌, బాడాన శేషగిరినాయుడు, మురళీ పాల్గొన్నారు.
  • ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్తూరు మండలంలో వైకాపాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తెదేపా పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు పెరిగాయి. పొన్నుటూరు సర్పంచి వై.చామంతి,  ఉప సర్పంచి వై.సంతోష్‌కుమార్‌, కలిగాం సర్పంచి ఎస్‌.కోటేశ్వరరావు, వైకాపా సీనియర్‌ నాయకుడు కూన అర్జునరావుతో పాటు 200 పైగా కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరాయి. మామిడి గోవిందరావు వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్‌ నాయకుడు ఎ.భైరాగినాయుడు, ఎల్‌.తులసీవరప్రసాద్‌ పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని