logo

మాణిక్కం ఠాగూర్‌పై అనర్హతవేటు వేయాలన్న పిటిషన్‌ కొట్టివేత

విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్‌పై అనర్హత వేటు వేయాలని కోరిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. 

Published : 23 Apr 2024 01:04 IST

సైదాపేట, న్యూస్‌టుడే: విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్‌పై అనర్హత వేటు వేయాలని కోరిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి మాణిక్కం ఠాగూర్‌ మద్దతుదారులు ఓటర్లకు టోకెన్లు ఇచ్చారని, అనర్హతవేటు వేసేందుకు, చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని విరుదునగర్‌కు చెందిన సెల్వకుమార్‌ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత రోజు ఈ పిటిషన్‌ దాఖలు చేశారని, పోలీసుశాఖ కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారు చర్యలు తీసుకుంటారని న్యాయమూర్తులు తెలిపారు. ఫిర్యాదుదారుడు ఎన్నికల కేసు కావాలంటే దాఖలు చేయాలని చెప్పి పిటిషన్‌ తోసిపుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని