logo

20 రోజుల్లో రూ.190 కోట్లు

చెన్నై కార్పొరేషన్‌లో ఏప్రిల్‌ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్‌ ప్రకటించింది.

Published : 23 Apr 2024 01:08 IST

చెన్నై కార్పొరేషన్‌లో ఆస్తిపన్ను వసూలు
నెలాఖరులోపు చెల్లించేవారికి 5 శాతం రాయితీ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నై కార్పొరేషన్‌లో ఏప్రిల్‌ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్‌ ప్రకటించింది. చెన్నై కార్పొరేషన్‌ ఆదాయంలో ఆస్తిపన్ను ప్రధానమైనది. నగరంలోని 13.59 లక్షల ఆస్తి యజమానుల నుంచి అర్ధ సంవత్సరానికి రూ.850 కోట్లు, ఏడాదికి రూ.1,700 కోట్లు అందుతుంది. ఏప్రిల్‌ 30లోపు మొదటి అర్ధ సంవత్సరానికి, అక్టోబరు 30లోపు రెండో అర్ధానికి చెల్లించాలి. గడువులోపు చెల్లిస్తే 5శాతం, అత్యధికంగా రూ.5 వేల వరకు రాయితీ అందుతుంది. ఆ తర్వాత చెల్లిస్తే ఒకశాతం ప్రత్యేక వడ్డీ విధిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్‌ లక్ష్యం దాటి రూ.1,800 కోట్లు వసూలైంది. ఇది అంతకుముందు సంవత్సరానికి కంటే రూ.227 కోట్లు అధికం. ఈ ఏడాది 2.31 లక్షల మంది పన్ను చెల్లించి 5శాతం రాయితీ పొందారు. మిగిలినవారు కూడా 30లోపు చెల్లించి రాయితీ పొందాలని కార్పొరేషన్‌ కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని