logo

ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.

Published : 25 Apr 2024 00:19 IST

మాట్లాడుతున్న తమిళిసై సౌందరరాజన్‌

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగిశాయన్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అదే సమయంలో లక్షలాది మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారని, ఎన్నికల కమిషన్‌ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు వేయడం ప్రజాస్వామ్య హక్కు అని, ఆధారాలు ఉన్నా అనేక మంది పేర్లు ఓటరు జాబితాల నుంచి గల్లంతయ్యాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ అవసరమయ్యే అభివృద్థి పథకాలను ప్రజలకు వివరిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారని, అందులో ఎక్కువగా ముస్లింలు లబ్ధి పొందారని, ఆయుష్మాన్‌ భారత్‌లోనూ ముస్లింలకే ఎక్కువ ప్రయోజనం చేకూరందని పేర్కొన్నారు. ఎలాంటి మత బేధం లేకుండా పదేళ్లుగా అందరికీ అవసరమయ్యే పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలు, పేదలను ఓటు బ్యాంకులుగా చూస్తోందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని