logo

యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్‌ కుమారుడి సత్తా

నెల్లై జిల్లా కల్లిడైకురిచ్చికి చెందిన వేల్‌మురుగన్‌ టీ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు పేచ్చి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో 567వ స్థానంలో నిలిచి ప్రతిభ కనబర్చాడు.

Updated : 29 Apr 2024 08:03 IST

టీ కాస్తున్న వేల్‌మురుగన్‌, కుమారుడు పేచ్చి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: నెల్లై జిల్లా కల్లిడైకురిచ్చికి చెందిన వేల్‌మురుగన్‌ టీ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు పేచ్చి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో 567వ స్థానంలో నిలిచి ప్రతిభ కనబర్చాడు. ఇతను 1 నుంచి 12వ తరగతి వరకు ప్రైవేట్‌ పాఠశాలలో, ఆ తర్వాత అన్నా యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు. 4 సార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించలేదు. టీఎన్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నెల్లై జిల్ల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాల్లో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవసాగాడు. ఇతని తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలు. సోదరి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. టీ దుకాణం నడుపుతున్న తండ్రి వేల్‌మురుగన్‌ తన కుమారుడి కలను నెరవేర్చాడానికి తన ఆస్తి, ఇంటిని విక్రయించాడు. ప్రస్తుతం పరీక్షల్లో కుమారుడు ఉత్తీర్ణత సాధించడంతో ఆనందంతో మురిసిపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని